NDB || 28,000 Years Battery Life || Nano Diamond battery-2020 || Unlimited Power For Mobiles - buyndb.com

NDB || 28,000 Years Battery Life || Nano Diamond battery-2020 || Unlimited Power For Mobiles

Mama facts
Views: 118
Like: 20
మీ వద్ద ఉన్న సెల్ ఫోన్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే జీవితకాలంలో మళ్లీ చార్జింగ్ చేయాల్సిన అవసరం రాకపోతే…! మీ కారు బ్యాటరీ మీ మనవళ్లు పెద్దవాళ్లయ్యేవరకు పనిచేస్తూనే ఉంటే…! సాధారణంగా ఇలాంటివి ఇప్పటివరకు ఏమాత్రం ఊహించలేనవి! కానీ కాలిఫోర్నియాకు చెందిన ఎన్డీబీ అనే స్టార్టప్ సంస్థ అద్భుతమైన బ్యాటరీ తయారుచేసింది.

ఈ బ్యాటరీని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 28 వేల సంవత్సరాల పాటు పనిచేస్తుందని ఎన్డీబీ వెల్లడింది. పూర్తిసామర్థ్యంతో 5 వేల ఏళ్ల పాటు తిరుగులేకుండా పనిచేస్తుందట. ఆ తర్వాత సామర్థ్యం తగ్గినా ఓవరాల్ గా 28,000 ఏళ్లపాటు సేవలు అందిస్తుందని సదరు స్టార్టప్ చెబుతోంది. ఈ బ్యాటరీలో అణు వ్యర్థాలను ఉపయోగించారు. బ్యాటరీ పదార్థాలు లీక్ కాకుండా కృత్రిమ వజ్రం (సింథటిక్ వజ్రం) కోటింగ్ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత దృఢమైన పదార్థం వజ్రమేనని తెలిసిందే.

తాము తయారు చేసిన బ్యాటరీ అణు వ్యర్థాల నుంచి తయారైనదే అయినా, మానవ దేహం నుంచి వెలువడే రేడియో ధార్మికత కంటే ఈ బ్యాటరీ నుంచి తక్కువ స్థాయిలో ధార్మికత వెలువడుతుందని ఎన్డీబీ వివరించింది.

#nucleardiamondbattery
#nucleardiamondbatterytelugu
#nucleardiamondbatteryenergy
#mamafacts